న్యూఢిల్లీ, న వంబర్ 2: ప్రపం చ ప్రసిద్ధ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ పె ట్టుబడుల కంపెనీ బెర్క్‌షైర్ హాథ్‌వే వద్ద 325 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.27.30 లక్షల కోట్లు) నగదు నిల్వలు పేరుకుపోయాయి. ప్రస్తుతం నెలకొన్న ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల కారణంగా పెద్ద టేకోవర్లకు దూరంగా ఉండటంతో పాటు పలు పెద్ద కంపెనీల్లో గణనీయంగా షేర్లను విక్రయించడంతో ఈ ఏడాది మూడో త్రైమాసికం చివరినాటికి 325 బిలియన్ డాలర్ల నగదు నిల్వలు ఉన్నాయని బెర్క్‌షైర్ హాథ్‌వే శనివారం వెల్లడించింది.
ఇంతమొత్తంలో నగదు నిల్వల్ని పెంచుకోవడం కంపెనీ చరిత్రలో ఇదే ప్రధమం. ఐఫోన్ తయారీ కంపెనీ యాపిల్‌లో బఫెట్ సంస్థ తన వాటాలో 25 శాతం వరకూ విక్రయించింది.