calender_icon.png 24 December, 2024 | 9:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్చరికలు

26-08-2024 12:30:00 AM

ఇక్కడ మనమంతా కలిసి జీవిస్తున్నాము కానీ మన జీవితాలు మనవి మాత్రం కాదు ఎవరో ఎక్కడో కూర్చొని మనల్ని అనుక్షణం శాసిస్తున్నారు ప్రాణాలు మనవే కానీ బతుకులు మాత్రం మనవికావు తలలు మనవే కానీ వాటిపై రుద్దిన అప్పులు మాత్రం నిజంగా మనవి కావు మనం నడిచే దోవ మనదే కానీ మనల్ని నడిపించే శక్తి ముమ్మాటికి మనది కానే కాదు మన చుట్టూ జరిగే కథ మనదే కానీ పాత్రధారులం మనం కాలేక పోవచ్చు చరిత్రలో ఎన్నో వింతలు, విశేషాలు నిండిపోవచ్చు కానీ మనకంటూ ఒక పేజీ ఖాళీగా మిగిలుండవచ్చు మనసులు మనవే కానీ వాటిలో ఆలోచనలు మాత్రం మనవి కావు అడుగడుగునా హెచ్చరికలు కానీ ప్రమాదాలు జరగక పోవచ్చు. 

శ్రిష్టి శేషగిరి 

9290652632