08-04-2025 12:04:16 AM
బూర్గంపాడు, ఏప్రిల్ 07(విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి పట్టాభిషేక మహోత్సవానికి విచ్చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఘన స్వాగతం పలికారు.బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ అతిథిగృహానికి చేరుకున్న ఆయనకు ప్రజా ప్రతినిధులు,అధికారులు మొక్కలు అందించి స్వాగతించారు. అనంతరం గవర్నర్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.గవర్నర్ ను స్వాగతించిన వారిలో ఎస్పీ రోహిత్ రాజ్ తదితరులు ఉన్నారు.