శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు భారీగా తరలొచ్చిన పార్టీశ్రేణులు
రాజేంద్రనగర్, జనవరి 24: దావోస్ ప ర్యటన ముగించుకొని రాష్ట్రానికి తిరిగొచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు, పార్టీశ్రేణులు ఘనస్వాగతం పలికారు. కాంగ్రెస్ సర్కార్ దావోస్‌లో వివిధ కంపెనీలతో రూ.1,78,950 కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్న విషయం విధితమే. పలువు రు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డికు ఆహ్వా నం పలికేందుకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఆయనకు బొకేలు, శా లువాలతో ఘనంగా సన్మానించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, పరిగి ఎమ్మె ల్యే రామ్మెహన్‌రెడ్డితోపాటు పలువురు కా ర్పొరేషన్ల చైర్మన్లు సీఎంకు స్వాగతం పలికా రు.
ఎయిర్‌పోర్ట్‌లో ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇటీవల ఖైరతాబాద్‌లో అధికారులు కూల్చివేతలు చే పట్టగా ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్య క్తం చేశారు. సీఎం విదేశాల నుంచి వచ్చేవరకు కూల్చివేతలు నిలిపివేయాలని డిమాం డ్ చేశారు. సీఎం వచ్చిన తర్వాత ఆయన్ను కలుస్తానని చెప్పిన విషయం తెలిసిందే.
వేలాదిగా కార్యకర్తలు..
కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, రేవంత్‌రెడ్డి అభిమానులు ఎయిర్‌పోర్ట్‌కు వేలాదిగా తరలొచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డితో కరచాలనం, సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు. ఆయన తన వాహనంలో ఎక్కిన తర్వాత అభివాదం చేస్తూ ముందుకు సాగారు. సీఎం.. సీఎం అంటూ పెద్దఎత్తున నినాదాలు చేయడంతో సందడి వాతావరణం నెలకొంది.