చేవెళ్ల, ఫిబ్రవరి 1 : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు చేవెళ్ల మండలానికి చెందిన బీఆర్‌ఎస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. శనివారం మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డితో కలిసి వికారాబాద్ జిల్లాలోని పూడూర్, పరిగి మండల పరిధిలో కార్యక్రమాల్లో హాజరయ్యేందుకు వెళ్తున్న ఆయనకు చిట్టపల్లి గేట్ వద్ద డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా పార్టీ కోసం బాగా పనిచేస్తు న్నారని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కేటీఆర్ వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, బీఆర్‌ఎస్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు వంగ శ్రీధర్రెడ్డి, నాయకులు గోనె కరుణాకర్రెడ్డి, శేరిరాజు, కెప్టెన్ అంజన్ గౌడ్, విఘ్నేశ్ గౌడ్, శేఖర్రెడ్డి, కావలి శేఖర్, ఆరిఫ్, బ్యాగరి సుదర్శన్, అబ్దుల్ ఘని, రామస్వామి, వీరాజంనేయులు, పాండు, వీరస్వామి, ఎల్లన్న, ఈశ్వరయ్య, శివారెడ్డి, రాంప్రసాద్, మాధవ్ రెడ్డి, రాఘవేందర్రెడ్డి, మాజీ సర్పంచ్లు వెంటకయ్య, గాయత్రి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.