చలికాలంలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఈ కాలంలో వృద్ధులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోకపోతే పలు అనారోగ్య సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. అందుకోసం ఈ జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది.
చలికాలంలో వృద్ధులు వెచ్చగా ఉండే బట్టలు ధరించాలి. అలాగే.. ముఖం, చేతులు, చెవులు, మెడ కు స్కార్ఫ్, మంకీ క్యాప్స్ ధరించాలి. బయటకు వెళ్లినప్పుడు ఉన్ని దుస్తులను ధరించాలి. అలాగే గదులు ఎల్లప్పుడూ వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. ఉష్ణోగ్రతలు తగ్గుతున్నప్పుడు కిటికీలు, తలు పులు మూసి ఉంచాలి. అయితే చాలామంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడడుతుంటారు. కాబట్టి ఇంట్లో ఎయిర్ కండీషనర్ ఉన్నవాళ్లు వింటర్ మోడ్‌కు సర్దుబాటు చేసుకుంటుండాలి.
పట్టు జారడకుండా
చలికాలంలో ఇల్లు, పరిసర ప్రాంతాలు మంచుతో తడిగా ఉంటాయి. చలికి రక్షణగా చాలామంది చెప్పు లు ధరిస్తుంటారు. దాంతో నేలపై లేదా మెట్ల మీద జారిపడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి బలమైన పట్టును కలిగి ఉండే బూట్లు, చెప్పులు మాత్రమే ధరించాలి. అలాగే నేల ఎల్లప్పుడూ పొడిగా ఉండేలా చూడాలి. అలాగే మోకాళ్లు, చేతులకు గార్డులతో రక్షణ పొందాలి.
సరైన పోషకాహారం
శీతాకాలంలో విటమిన్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్, ముక్కలు చేసిన పచ్చి కూరగాయలు, పెరుగు తరచూ తీసుకోవాలి. ఇవి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. చలికాలంలో తగినంత నీళ్లు తాగకపోతే డీహైడ్రేషన్‌కు గురవుతుం టారు. దీనిని నివారించడానికి విటమిన్ ‘సి’ అధికం గా తీసుకోవాలి. దాంతో శరీరం చురుగ్గా ఉంటుంది.
తగినంత నిద్ర, వేడి నీళ్లు
చలికాలంలో సరైన నిద్రతోపాటు నడక, వ్యాయా మం శరీరానికి ఎంతో మేలుచేస్తాయి. ఫ్లూ, న్యుమోనియా వ్యాధుల నుంచి కూడా రక్షణ పొందవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఈ సమయంలో వేడినీళ్లు తాగాలని, ఆవిరి పడుతూ శ్వాసనాళాలను శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు.
మరికొన్ని జాగ్రత్తలు
- వేడివేడిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.
- ఐస్క్రీం, చల్లని నీరు, జ్యూస్ తాగడం వల్ల జలుబు, శ్వాసకోశ సమస్యలొస్తుంటాయి. వాటికి దూరంగా ఉండాలి.
- శరీరానికి వేడినిచ్చే జొన్నలు, ఆకుకూరలు, సజ్జలు వంటి ఆహారంగా తీసుకోవాలి.
- రాత్రి వేళలో బయటకు వెళ్లకుండా ఉండాలి.
- తరచుగా చేతులను సబ్బుతో కడుక్కోవాలి. జలుబు, దగ్గు ఉన్నవారు తప్పనిసరిగా చేతిరుమాలు అడ్డుపెట్టుకోవాలి.
- చలికాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఇంటిలోకి వైరస్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇంటి పరిసరాలను ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి.