calender_icon.png 28 November, 2024 | 11:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చలికి వెచ్చటి ఆహారం

28-11-2024 12:00:00 AM

చలికాలం వచ్చేసింది. రోజురోజుకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలతో శరీరం కూడా అంతేస్థాయిలో చల్లబడుతుంది. చలికాలమే కదా లైట్‌గా తీసుకుంటే అనారోగ్య సమస్యలు తప్పవు. కాబట్టి సీజన్‌కు తగ్గట్టుగా ఆహార పద్ధతులు మార్చుకుంటేనే శరీరం ఫిట్‌గా ఉంటుంది. అయితే ఒక రోజులో శరీరానికి అవసరమయ్యే పోషకాలన్నీ దొరకవు. కానీ స్వీట్ పొటాటో తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి.

మొరంగడ్డ.. చిలకడ దుంప.. ఎర్రగడ్డ.. గనుసు గడ్డ.. కందగడ్డ.. ఇలా ప్రాంతాన్ని బట్టి స్వీట్ పొటాటోను పిలుస్తుంటారు. చలికాలంలో సాధారణంగా శరీరం వెచ్చదనం కోరుకుంటుంది. అలా అని వేడి వేడి ఆహార పదార్థాలను తినలేం. ఆరోగ్యంతోపాటు ఒంట్లో వేడిని పుట్టిచ్చే ఆహార పదార్థాలైతేనే బాగుంటుంది. అలాంటి ఫుడ్ ఐటమ్స్‌లో స్వీట్ పొటాటో ఒకటి.

వింటర్‌లో బెస్ట్ ఫుడ్ ఏదైనా ఉందంటే స్వీట్ పొటాటోనే అని చెప్పాలి. పోషకాలు పుష్కలంగా ఉండటమే అందుకు కారణం. ’హీలింగ్ ఫుడ్స్’ అనే పుస్తకంలో.. ‘ఒక చిలకడదుంపలో ఒక రోజు కంటే ఎక్కువ విలువైన బీటా-కెరోటిన్, రోజువారీ విటమిన్ సి ఉంటాయని’ రాసి ఉన్నది. దీన్ని ఉడకబెట్టొచ్చు. కాల్చుకొని తినొచ్చు. భారతీయులు అమితంగా ఇష్టపడే ఆహార పదార్థాల్లో ఇదొకటి. 

చర్మ ఆరోగ్యం

చిలగడదుంపలోని అధిక స్థాయి బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. అలాగే వృద్ధాప్యానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే గుణాలు ఉండటంతో చర్మానికి మేలు చేస్తుంది. మృదువైన, సౌందర్యమైన చర్మం కలిగి ఉండాలంటే చిలగడదుంపలను చలికాలం ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అలాగే చలికాలంలో మూడ్ స్వింగ్ అవుతుంటుంది. ఒత్తిడికి వ్యతిరేకంగా పోరాడే మెగ్నీషియం కంటెంట్ చిలగడదుంపలో అధికంగా ఉంటుంది. 

షుగల్ లెవల్స్ అదుపులో..

చిలగడదుంప ఒంట్లో వేడిని పుట్టించడమే కాదు.. అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది కూడా. మధుమేహాంతో బాధపడేవారు క్రమం తప్పకుండా తింటే కొంతవరకు వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే ఇందులోని కార్బోహైడ్రేట్లు, అడిపోనెక్టిన్ హార్మోన్స్ రక్తంలో షుగల్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుతాయి. 

రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు

స్వీట్ పొటాటోలో బీటా -కెరోటిన్, విటమిన్ సి అధికంగా ఉంటుంది. చిలగడదుం పను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.  చలికాలంలో సోకే అనేక రకాల ఇన్ఫెక్షన్లను అరిక డుతుంది. కాల్చి తిన్నా.. ఉడకబెట్టి తీసుకు న్నా వాటిలోని కార్బోహైడ్రేట్లు అవసరమైన పోషకాలు అందుతాయి. కాబట్టి వింటర్ ఫుడ్‌గా స్వీట్ పొటాటోను ఎంచుకోవచ్చు. 

జీర్ణక్రియ సమస్యలను..

చిలకడదుంపలో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీంట్లో ఉండే ఫైబర్ కంటెంట్ ఆహారాన్ని జీర్ణం చే యడంలో సహాయపడుతుంది. పేగు కదలికలను మృదువుగా చేసి మలబద్ధకాన్ని సమ ర్థవంతంగా నివారిస్తుంది. అయితే స్వీట్ పొటాటోలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబ ట్టి అరగడానికి ఎక్కువ సమయం పడుతుం ది.. ముఖ్యంగా గ్యాస్ సమస్యలు ఉన్నవారు, వృద్ధులు ఎంత తక్కువగా తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.