calender_icon.png 22 April, 2025 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వార్డెన్, ముగ్గురు సిబ్బంది సస్పెన్షన్

13-12-2024 01:00:57 AM

వికారాబాద్, డిసెంబర్12 (విజయక్రాంతి): తాండూరు ట్రైబల్ వెల్పేర్ బాలికల వసతిగృహంలో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటనపై జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ చర్యలకు పూనుకున్నారు.

గురువారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డితో కలిసి వసతిగృహాన్ని సందర్శించిన కలెక్టర్ పలువురు విద్యార్థులతో నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు వసతిగృహం వార్డెన్ విశ్వకుమారి, మరో ముగ్గురు వంట సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.