calender_icon.png 12 April, 2025 | 3:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ కార్డుల వెరిఫికేషన్లను వార్డ్ ఆఫీసర్స్ పరిశీలించాలి

04-04-2025 08:46:51 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి,(విజయక్రాంతి): పట్టణ ప్రాంతాల్లో రేషన్ కార్డుల వెరిఫికేషన్లను వార్డ్ ఆఫీసర్స్ పరిశీలించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం తన ఛాంబర్ లో జిల్లాలోని మున్సిపల్ కమీషనర్ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పట్టణ ప్రాంతాల్లో ప్రజా పాలనలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వాటిని మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్ పరిశీలన చేయాలని తెలిపారు. ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను గ్రామీణ ప్రాంతంలో పంచాయతీ కార్యదర్శులు పరిశీలన చేయాలని, మీ సేవా ద్వారా వచ్చిన దరఖాస్తులను రెవిన్యూ సిబ్బంది పరిశీలన చేయాలన తెలిపారు. ఆయా దరఖాస్తులను ఇంటింటికి తిరిగి పరిశీలన చేయాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే నిర్మాణ పనుల పరిశీలనను పంచాయతీ కార్యదర్శులు, పట్టణ ప్రాంతాల్లో నిర్మాణాలను వార్డ్ ఆఫీసర్స్ పరిశీలించాలని తెలిపారు. ఈ సమావేశంలో కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ లు రాజేందర్ రెడ్డి, శ్రీహరి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.