లక్షెట్టిపేట, (విజయక్రాంతి): మున్సిపాలిటీలోని 15వ వార్డు కాలనీలో శనివారం కురుస్తున్న వర్షానికి 15వ వార్డు అంకతివాడ నీట మునిగింది. కాలనీలో రోడ్లు లేకపోవడంతో కాలనీలో ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. మోకాళ్ళ లోతు నీరు చేరడంతో ప్రజలు బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు రోడ్డు వేయకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని.. ఇప్పటికైనా రోడ్డు వేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.