హనుమకొండ,(విజయక్రాంతి): హనుమకొండలో ప్రజాపాలన-ప్రజా విజయోత్సవ సభను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా వరంగల్ లోని ఆర్డ్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వియోత్సవ సభ రేవంత్ రెడ్డి హజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ... గత బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వరంగల్ కు ఎన్నో హామీలు గుప్పించారు కానీ ఒక్కటీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. వరంగల్ మంచి నగరంగా అభివృద్ధి చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడూ చెప్తుంటారు. ఒక్కరోజులోనే వరంగల్‌కు దాదాపు రూ.5 వేల కోట్ల నిధులు కేటాయించారని పేర్కొన్నారు. వరంగల్ ప్రజల చిరకాలవాంఛ విమానాశ్రయం కూడా త్వరలో సాకారం కానుందని, కేంద్రాన్ని ఒప్పించి నగరానికి విమానాశ్రయం సాధించామన్నారు. హైదరాబాద్ స్థాయిలో వరంగల్ ను అన్ని అంశాల్లో అభివృద్ధి చేస్తామని కొండా సురేఖ చెప్పారు.