25-04-2025 01:36:45 AM
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్, ఏప్రిల్ 24 : ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవాలను జయప్రదం చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. వరంగల్ సభలో నిర్వహించే వేడుకల్లో భాగంగా హస్తినాపురం డివిజన్ లోని నందనవనం వార్డు ఆఫీస్ పక్కన, ఇంద్రసేనారెడ్డి నగర్, జడ్పీ రోడ్డు వద్ద బీఆర్‌ఎస్ జెండా పండుగ నిర్వహించారు.
ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొని బీఆర్‌ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ నెల 27న వరంగల్ సభకు ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు గజ్జల మధుసూదన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ పద్మా శ్రీనివాస్ నాయక్, డివిజన్ అధ్యక్షులు సత్యంచారి, మహిళా అధ్యక్షురాలు ఆదిలక్ష్మి, కార్యకర్తలు పాల్గొన్నారు.