17-04-2025 01:05:21 AM
మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
నాగల్ గిద్ద, ఏప్రిల్ 16 :నాగల్ గిద్ద మండల కేంద్రంలోని పుసల్పడ్ పత్తిమిల్లు మండల బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతోమాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి సమావేశమై ఈనెల 27న వరంగల్ లో జరగబోయే బీఆర్‌ఎస్ పార్టీ బహిరంగ సభ గురించి దిశా నిర్దేశం చేశారు. బిఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. బీఆర్‌ఎస్వి మండల ప్రధాన కార్యదర్శి గాజులపాడు భీమన్న జన్మదినం వేడుకల్లో భూపాల్ రెడ్డి పాల్గొని సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పండరి, మండల ఉపాధ్యక్షులు అంజిరెడ్డి, మాజీ రైతు బందు అధ్యక్షులు నందు పాటిల్ , ప్రహ్లాద, అశోక్ రావు పాటిల్, సంజీవ్ కుమార్,కృష్ణ ప్రసాద్, గుణవంత్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.