ఎంఎస్ చేసేందుకు యూఎస్ వెళ్లిన యువకుడు
కాలేజీ సెల్లార్‌లోని కారులో అనుమానాస్పద స్థితిలో మృతి
జనగామ/వరంగల్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): ఎంఎస్ చదివేందుకు అమెరి కాకు వెళ్లిన వరంగల్ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. హనుమ కొండ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామానికి చెందిన బండి వంశీ(24) వరంగల్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఏడాది క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ మిన్నేసోటాలో పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ చదువుకుంటున్నాడు.
ఈ క్రమంలో మూడు రోజుల క్రితం తాను చదువుకుంటు న్న కాలేజీలో సెల్లార్ పార్కింగ్‌లోని కారు లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఎవరైనా ఆయ నను హత్య చేసి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వంశీ మృతి చెందిన విషయం ఆలస్యంగా సోమవారం తన కుటుంబ సభ్యులకు తెలియడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహాన్ని స్వస్థ లానికి రప్పించేందుకు ఇప్పటికే స్థానిక బీజేపీ నాయకులు కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డితో మాట్లాడారు.