calender_icon.png 1 March, 2025 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

సీఎం రేవంత్‌రెడ్డికి వరంగల్‌ నేతల కృతజ్ఞతలు

01-03-2025 01:11:53 PM

హైదరాబాద్: ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల చిరకాల కోరికైన మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో అందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy)కి జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం సలహాదారు  వేమ నరేందర్ రెడ్డి, ఎంపీలు కావ్య , పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, డీసీసీ అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిసి అభినందనలు తెలిపారు. వరంగల్‌లోని మామ్నూర్ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మామ్నూర్‌లో విమానాశ్రయ(Warangal Airport At Mamnoor) నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం చాలా కాలంగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది.