calender_icon.png 10 January, 2025 | 7:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధిలో హైదరాబాద్ తర్వాత వరంగలే

07-01-2025 01:52:12 AM

  • త్వరలోనే ఎయిర్‌పోర్టు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ

వరంగల్ ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

జనగామ, జనవరి 6: రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అదే స్థాయిలో వరంగల్‌ను మహానగరంగా తీర్చిదిద్దుతామని ఉమ్మడి వరంగల్ ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.

సోమవారం హనుమ  మంత్రులు కొండా సురేఖ, పొ న్నం ప్రభాకర్, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎంపీ కడియం కావ్య, నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, గండ్ర సత్యనారా యణ, దొంతి మాధవరెడ్డి, కె.ఆర్.నాగరాజు తదితరులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, భద్రకాళి చెరువు పూడిక తీత అభివృద్ధి పనులపై పొంగులేటి సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ను అభి వృద్ధి చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నట్లు తెలిపారు. నగరంలో ఎయిర్‌పోర్టు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇన్నర్, అవుటర్ రింగు రోడ్డు, కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్కు తదితర అభివృద్ధి పనుల కోసం తనకు ఇన్‌చార్జి మంత్రిగా బాధ్యతలు అప్పగించినట్లు గుర్తు చేశారు. వరంగల్‌కు రూ.6 వేల కోట్లకు పైగా నిధులను సీఎం మంజూరు చేసినట్లు తెలిపారు. 

రాష్ట్రవ్యాప్తంగా 4.50  లక్షల ఇండ్లు 

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల 50 వేల ఇండ్లు కట్టి నియోజకవర్గానికి 3,500 చొప్పున లబ్ధిదారులకు మంజూరు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఇండ్లకు దరఖాస్తు చేసుకోని వారికి మరోసారి అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. జనవరి 26 నుంచి రైతు భరోసా కింద అన్నదాతలకు ఏడాదికి రూ.12 వేలు అందజేయనున్నట్లు తెలిపారు. వ్యవసాయ కూలీలకు కూడా ఈ సాయం అందుతుందన్నారు. త్వరలోనే రేషన్ కార్డుల ప్రక్రియ షురూ అవుతుందని తెలిపారు.

దేశానికే ఆదర్శంగా ఆర్టీసీ

దేశంలోనే టీజీఎస్ ఆర్టీసీని మోడల్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ అన్నారు. వరంగల్‌లో ఎలక్ట్రిక్ బస్సులను సోమవారం వారు ప్రారంభించారు. సంక్రాంతి లోపు మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేసి వరంగల్‌ను కాలుష్య రహితంగా తయారుచేయనున్నట్లు తెలిపారు.