హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన వరంగల్‌కు సమీపంలో మామునూరు విమానాశ్రయం తిరిగి పునరుద్ధరణ కావడం, ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు కేటాయించడం అభినందనీ యం. పూర్వం ఈ విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు యుద్ధ, సైనిక విమానాలు నడిచాయని చెప్తారు. వరంగల్ జిల్లా ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఈ ఎయిర్పోర్ట్ పునఃప్రారంభించాలని ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తున్నారు. ఎట్టకేలకు ప్రస్తుత ప్రభుత్వం నిధులు విడుదల చేయడం హర్షదాయకం.
- కామిడి సతీశ్‌రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా