calender_icon.png 19 April, 2025 | 7:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి

13-04-2025 06:11:06 PM

మందమర్రి,(విజయక్రాంతి): ఈ నెల 27న వరంగల్ లో జరుగనున్న బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బిఆర్ఎస్ చెన్నూరు నియోజక వర్గం ఇన్చార్జి డాక్టర్ రాజా రమేష్ కోరారు. పట్టణంలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో బీఆర్ఎస్ రజతోత్సవ పోస్టర్లను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. ఈనెల 27న వరంగల్ లో జరగనున్న రజతోత్సవ సభకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు అవుతున్నారని నియోజకవర్గంలోని బిఆర్ఎస్ నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ఈ సభలో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిర సిస్తూ భవిష్యత్ ఆందోళన కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో  టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షులు  మేడిపల్లి సంపత్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బండారి సూరిబాబు, ఓ రాజ శేఖర్, ఎండి అబ్బాస్, తిరుపతి రెడ్డి, ముస్తఫా, తోట సురేందర్, బట్టు రాజకుమార్, కనకం రవీందర్, దాసరి రాజనర్సు, టీబిజికేస్ యూనియన్ నాయకులు, వార్డు అధ్యక్షులు, యూత్, విద్యార్థి, సోషల్ మీడియా, మహిళ నాయకులు  పాల్గొన్నారు.