calender_icon.png 3 April, 2025 | 10:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జవహర్ నగర్ డంపింగ్ యార్డును పరిశీలించిన వరంగల్, హన్మకొండ జిల్లా కలెక్టర్లు

03-04-2025 12:36:52 AM

చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడంపై ప్రశంస 

మేడ్చల్, ఏప్రిల్ 2 (విజయ క్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని జవహర్ నగర్ డంపింగ్ యార్డును వరంగల్, హనుమకొండ జిల్లాలకలెక్టర్లు డాక్టర్ సత్య శారద, ప్రావీణ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే బుధవారం సందర్శించారు.

జీహెచ్‌ఎంసీలో అమలవుతున్న ఘన వ్యర్థాల నిర్వహణ పద్ధతి, చెత్త నుంచి విద్యుత్తు తయారీ, చెత్త ట్రాన్స్ఫర్ తయారీ స్టేషన్లను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ చెత్తతో విద్యుత్తును ఉత్పత్తి చేయడం అద్భుతమని పేర్కొన్నారు.హైదరాబాద్లోని చెత్తను జవహర్నగర్ డంపింగ్ యార్డ్కు తరలించి ఆధునిక టెక్నాలజీతో అద్భుతాలు సృష్టించడం అభినందనీయమని కలెక్టర్లు కొనియాడారు.

జవహర్నగర్ డంపింగ్ యార్డులో చెత్త నుంచి కరెంట్, గ్యాస్ను తయారు చేస్తున్న విధానాన్ని పరిశీలించామని, ఇదే తరహాలో గ్రేటర్ వరంగల్ లోఅభివృద్ధి చేస్తామని చెప్పారు.డంపింగ్యార్డ్లో కొత్త టెక్నాలజీతో చేస్తున్న అధ్యయనాలు బాగున్నాయని వారు ఈ సందర్భంగా కితాబిచ్చారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మె్ంప స్టడీ టూర్లో భాగంగా డంపింగ్యార్డ్ను సందర్శించిన కలెక్టర్లుజవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వద్ద సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్‌నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తున్న రాంకీ సంస్థ ప్రతినిధులు జిడబ్ల్యూఎంసీని  శుక్రవారం సందర్శించి రాంపూర్ డంపింగ్ యార్డ్ వద్ద శాశ్విత ప్రతిపాదికన అనుసరించవలసిన పద్ధతులను, సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తారనివారు తెలిపారు.