21-02-2025 12:00:00 AM
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో స్పై థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ రా ఏజెంట్‌గా నటిస్తున్నాడని బాలీవుడ్ మీడియా చెబుతోంది. ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తుండటంతో తెలుగు ప్రేక్షకులు సైతం ఈ సినిమా అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి రైటర్ అబ్బాస్ ఒక అప్‌డేట్ పంచుకున్నారు.
సినిమా విడుదల తేదీని సైతం ప్రకటించారు. “వార్ 2’ షూటింగ్ దాదాపు పూర్తుంది. ఆగస్ట్ 25న విడుదలయ్యే అవకాశం ఉంది. ‘వార్ 2’ డైలాగ్స్ అన్నీ నేనే రాశా. షారుఖ్ ఖాన్, సిద్దార్థ్ ఆనంద్‌ల కాంబోలో ఓ సినిమాతో పాటు ‘పఠాన్ 2’ కూడా ప్రారంభం కానుంది. వీటికి కూడా నేనే వర్క్ చేస్తున్నా” అంటూ అబ్బాస్ చెప్పుకొచ్చారు. మొత్తానికి ‘వార్ 2’ అయితే ఆగస్ట్ విడుదల కాబోతోందన్న మాట. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా రూపొందిన ‘వార్’ చిత్రం మంచి సక్సెస్ సాధించింది.
దీనికి సీక్వెల్‌గా ‘వార్ 2’ రూపొందుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర గతంలో ఏజెంట్ పాత్రల్లో నటించిన మెప్పించిన సల్మాన్ ఖాన్, హృతిక్, షారుక్ ఖాన్‌లకు భిన్నంగా ఉంటుందట. మరోవైపు ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ గురువారం సినిమాను మొదలు పెట్టేశాడు.