calender_icon.png 10 January, 2025 | 9:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణభవన్‌లో వార్ రూమ్

10-01-2025 12:42:53 AM

హైదరాబాద్, జనవరి 9 (విజయక్రాం తి): ఫార్ములా ఈ కారు రేసులో కేటీఆర్ విచారణ వేళ.. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ నేతలు వార్ రూమ్‌లో ప్రత్యేకంగా సమావేశ మయ్యారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతోపాటు లీగల్ టీమ్‌తో సమాలోచనలు చేశారు.

కేటీఆర్ విచారణ ప్రారంభమైనప్పటి నుంచి ముగింపు వరకు తెలంగాణ భవన్ నుంచే పర్యవేక్షించారు. తర్వాత కొందరు నేతలు కేటీఆర్ నివాసానికి వెళ్లారు. మరోవైపు కేటీఆర్ విచారణ నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి.