calender_icon.png 3 February, 2025 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్రంపై యుద్ధమే

03-02-2025 01:40:05 AM

రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో కిషన్‌రెడ్డి, బండి విఫలం

  1. ఎన్డీయేతర రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం వివక్ష 
  2. నిధుల కోసం శాంతియుత పోరాటం 
  3. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్.. నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

హైదరాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి) :  తెలంగాణపై కేంద్రం వైఖరికి నిరసనగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం సాక్షిగా బీజేపీపై యుద్ధం ప్రకటిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహే శ్‌కుమార్‌గౌడ్ అన్నారు.  తెలంగాణ సం క్షేమం, అభివృద్ధి కోసం రాజకీయాలను పక్కన పెట్టి బీఆర్‌ఎస్‌తో సహా మిగతా పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.

తెలంగాణపై కేంద్రం కక్ష పూరిత వైఖరికి నిరసనగా కాంగ్రెస్ చేపట్టే కార్యక్రమాలకు బీఆర్‌ఎస్‌తో సహా తెలంగాణ వాదు లు ముందుకు రావాలన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగింద ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్ వద్ద పార్టీ కేడర్‌తో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడారు.

‘తెలంగాణ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఇద్దరు కేంద్ర మంత్రులు  కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కి రాష్ట్ర అభివృద్ధి పట్టదా? రాష్ట్రం పట్ల ప్రేమ ఉంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి తమ పదవులకు రాజీనామా చేయాలి. -తెలంగాణ కోసం సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఒం టరి పోరాటం చేస్తున్నారు.

- తెలుంగింటి కోడలు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ సమగ్ర అభివృద్ధికి కాకుండా కేవలం రాజకీయ ప్రయోజనాలకే  కేటాయించినట్టుగా ఉంది. తెలంగా ణ సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై బీజేపీ చూపిస్తున్న వివక్ష, రాజకీయ కక్ష కు బడ్జెట్ కేటాయింపులే నిదర్శనం.  రాష్ర్టం నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలు ఉంటే కేంద్రం తెలంగాణకు గాడిదగుడ్డు ఇచ్చింది.

“దేశమంటే మట్టి కాదో య్ దేశమంటే మనుషులోయ్‌” అనే  తెలుగు గేయం వినిపించి తెలుగువారి ఆకాంక్షలకు, తెలుగునేల అభివృద్ధికి మొండిచేయి చూపించారు. - బడ్జెట్  కేటాయింపులు ఢిల్లీ, బీహర్ ఎన్నికల కోసమే అన్నట్లుగా ఉంది. రాజకీయ అవసరాల కోసం బీజేపీ  కేంద్ర బడ్జెట్‌ను ఉపయోగించుకుంటూ రాష్ట్రాలను విడదీస్తూ జాతి సమగ్రతను పక్కన పెట్టింది.

-దేశ జీడీపీలో 5.1 శాతం వాటా ఉన్న తెలంగాణకు 2.10 శాతమే తిరిగి వస్తోంది. -తెలంగాణ నుం చి  జీఎస్టీ, ఇతర పన్నుల రూపంలో సుమారు రూ. లక్ష కోట్లు వసూలు చేస్తున్న కేంద్రం.. కనీసం రూ.40 వేల కోట్లు  తిరిగి ఇవ్వకపోవడం బాధాకరం.- బడ్జెట్‌లో విభజన చట్టం హామీలు, మెట్రో రెండో దశకు నిధుల కేటాయింపుతో పాటు ఇతర వాటికి కేటాయిం పులు శూన్యం. 

- సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అని గొప్పలకు పోయే బీజేపీకి దేశంలో ఉన్న 140 కోట్ల ప్రజలు, వారి సమస్యలు కనపడకపోవడం విడ్డూరం. -2025 -26 బడ్జెట్ కేటాయింపులు చూసి తెలంగాణ ప్రజలు బీజేపీని ఎప్పటికీ క్షమించరు. తెలంగాణ అభ్యున్నతి కోసం రాజకీయాలకు అతీతంగా ప్రతి తెలంగాణ పౌరుడు ఏకతాటిపైకి రావాల్సిన అవ సరం ఉంది.- 

కేంద్రం నిధులు ఇచ్చే వరకు శాంతియుతంగా పోరాటం చేస్తాం’ అని మహేష్‌కుమార్‌గౌడ్ స్పష్టం చేశారు. అంతేకాకుండా సీఎం రేవంత్‌రెడ్డి డిల్లీ పర్యటనపై విమర్శలు చేసే బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు బడ్జెట్ కేటాయింపులపై ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

కేంద్రం వైఖరికి నిరసనగా సోమవారం కూడా రాష్ర్ట వ్యాప్తంగా గల్లీ నుంచి పట్టణం వరకు జరిగే నిరసన కార్యక్రమాల్లో ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి, తెలంగాణ నుం చి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రుల దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలని మహేష్‌కుమార్‌గౌడ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఆయోధ్య అక్షింతలు తప్ప.. అభివృద్ధ్దికి నిధులేవి : మంత్రి సీతక్క  

నిధుల కేటాయింపులో తెలంగాణ కు కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని రాష్ట్ర మంత్రి సీతక్క విమర్శించారు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులకు అనే క వినతిపత్రాలు సమర్పించినా చివర కు మొండి చెయ్యే చూపారని మండిపడ్దా రు.  బీజేపీ వాళ్ళు అయోధ్య నుంచి అక్షింతలు తెచ్చి పంచారే తప్ప రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు.

అక్షింతలకు ఓట్లు వేయాలా?  అభివృద్ధికి ఓటు వేలా యా? అనే విషయం ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎన్నికల బడ్జెట్‌గానే ఉందన్నారు. తెలంగాణపై బీజేపీకి ధ్వేషముం దనే విషయం బడ్జెట్‌తో స్పష్టమైందన్నారు.

మూడుసార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ విభజన చట్టంలోని హామీలు నేర వేర్చ లేదన్నారు. ధర్నా కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్,  సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీ లు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.