calender_icon.png 29 December, 2024 | 7:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నటుల మధ్య మాటల యుద్ధం

29-12-2024 03:02:32 AM

ముంబై, డిసెంబర్ 28: మన్మోహ న్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ చిత్రం లో కీలక పాత్ర పోషించిన అనుపమ్ ఖేర్, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ పాత్రను ఈ చిత్రంలో పోషించిన యాక్టర్ హన్సల్ మెహతా మధ్య ఆన్‌లైన్‌లో మాటల యుద్ధం నడుస్తోంది.

అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో 2019లో మాజీ ప్రధాని మన్మోహన్ జీవిత చరిత్ర ఆధారంగా ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ అనే మూవీ వచ్చింది. ఇందులో హన్సల్ మెహతా కూడా నటించాడు. జర్నలిస్ట్ వీర్ సంఘ్వీ ఎక్స్‌లో ఒక పోస్ట్ చేస్తూ ‘ఇదో చెత్త హిందీ మూవీ. మీడియాను ఉపయోగించుకుని ఒక వ్యక్తి ప్రతిష్టను ఎలా దెబ్బతీయొచ్చో ఈ మూవీ ద్వారా నిరూపించారు.

ఒక మంచి వ్యక్తి పేరును చెడగొట్టారు’ అని ట్వీట్ చేశారు. దీనిపై మెహతా స్పందిస్తూ +100 అని కామెంట్ చేశారు. అనుప మ్ ఖేర్ స్పందిస్తూ.. హన్సల్ మెహతాను రెండు నాల్కల ధోరణి గల వ్యక్తి గా అభివర్ణించారు. ‘ఈ సినిమాకు హన్సల్ క్రియేటివ్ డైరెక్టర్‌గా పని చేశా రు. ఇంగ్లండ్‌లో జరిగిన షూటింగ్ మొత్తంలో ఆయన పాల్గొన్నారు.

హన్సల్ పెద్దవాడిగా ఆలోచించు. షూటింగ్ సమయంలోని అన్ని ఫొటో లు వీడియోలు నా వద్ద ఉన్నాయి’ అని అనుపమ్ సమాధానమిచ్చాడు. దీనికి హన్సల్ మెహతా కూడా సమాధానమిస్తూ.. అవును నేను చేసింది తప్పే. నేను నా వ్యక్తిగత వృత్తిని నిర్వర్తించాను’ అని తెలిపారు.