calender_icon.png 10 January, 2025 | 11:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ, ఆప్ మధ్య లేఖల యుద్ధం

02-01-2025 03:20:12 AM

  1. ఓట్ల కోసం ఢిల్లీలో బీజేపీ నోట్లు పంచుతుంది
  2. ఈ తప్పుడు పనులను ఆర్‌ఎస్‌ఎస్ సమర్ధిస్తుందా?
  3. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌కు కేజ్రీవాల్ లేఖ 

న్యూఢిల్లీ, జనవరి 1: ఓట్ల కోసం బీజేపీ నేతలు బహిరంగాంగానే డబ్బులను పంచుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు కేజ్రీవాల్ బుధవారం లేఖ రాశారు. డబ్బుతో ఓట్లను కొని, ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందిని తన లేఖలో కేజ్రీవాల్ విమర్శించారు.

ఓట్ల కొనుగోలును ఆర్‌ఎస్‌ఎస్ సమర్ధిస్తుందా? మోహన్ భగవత్‌ను ప్రశ్నించారు. దళితులు, పూర్వాలంచల్ ఓటర్ల పేర్లను ఓటర్ జాబితా నుంచి పెద్ద మొత్తంలో బీజేపీ తొలగిస్తోందోని ఆరోపించారు. ఇలా చేయడం ప్రజాస్వామ్యానికి మంచిదా? అని అడిగారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ బలహీనపరుస్తుందని ఆర్‌ఎస్‌ఎస్‌కు అనిపించడం లేదా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. 

ఆరోపణలను కొట్టిపారేసిన బీజేపీ

ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు కేజ్రీవాల్ లేఖ రాయగా.. దానికి కౌంటర్ ఇస్తూ కేజ్రీవాల్‌కు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ లేఖ రాశారు. కేజ్రీవాల్ అబద్ధాలు చెప్పడం మానేయాలని లేఖలో పేర్కొన్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా కేజ్రీవాల్ అబద్ధాలు చెప్పడం మానేయాలని ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్నారన్నారు.

తన పిల్లలపై ఆయన ఇకపై తప్పుడు ప్రమాణాలు చేయరని భావిస్తున్నట్టు సచ్‌దేవ పేర్కొన్నారు. దేశ వ్యతిరేక శక్తుల నుంచి విరాళాలు సేకరించనని పేర్కొంటూ కేజ్రీవాల్ ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. మీడియా దృష్టిని ఆకర్షించేందుకే ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌కు కేజ్రీవాల్ లేఖ రాశారని బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంఘ్‌కు లేఖలు రాయడం మానుకుని దాని నుంచి సేవా స్ఫూర్తిని నేర్చుకోవాలని హితవు పలికారు. కాగా ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.