జగిత్యాల, జూన్ 28 (విజయక్రాంతి): జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను తనను సంప్రదించకుండా పార్టీలో చేర్చుకున్నారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అలకతో మొదలైన వివా దం సద్దుమణిగిందని కాంగ్రెస్ అధిష్టానం వెల్లడించింది. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ వివాదం మళ్లీ రాజుకుంది.
జగిత్యాల కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే అనుచరులు నియోజకవర్గ అభివృద్ధికై కాంగ్రెస్ పార్టీలో చేరిన సంజయ్ అంటూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీంతో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అనుచరులు జగిత్యాల అంటే జీవన్‌రెడ్డి, జీవన్‌రెడ్డి అంటే జగిత్యాల అని రాసిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వైరం మొదటికొచ్చింది. సపక్షంలోనే విపక్షం అన్నట్లుగా జగిత్యాల కాంగ్రెస్‌లో అంతర్యుద్ధం ఆరంభమైంది.