17-03-2025 12:37:42 AM
ఎన్టీఆర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. నిరుడు ‘దేవర’తో మెప్పించారు. ఈ ఏడాది ‘వార్2’ తో అలరించనున్నారు. ఎన్టీఆర్ తొలిసారి హిందీలో నటిస్తున్న చిత్రమిది. మరో హీరో హృతిక్ రోషన్ ఇటీవల డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డారు.
దీంతో ఈ సినిమా విడుదల ఆలస్యమయ్యే అవకాశం ఉందంటూ నెట్టింట ప్రచారం జరిగింది. అయితే, చిత్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ మూవీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చింది. ఎక్స్ వేదికగా ఓ మీమ్ పేజ్ ఈ చిత్రం గురించి ఓ వీడియోను రూపొందించగా, దానిపై యష్‌రాజ్ ఫిల్మ్స్ స్పందించింది. ‘వార్2’ ఆగస్టు 14న థియేటర్లలోకి వస్తుందని స్పష్టం చేయడంతో ఎన్టీఆర్ అభిమానులు ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు.