calender_icon.png 11 January, 2025 | 6:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యుద్ధ మేఘాలు

30-07-2024 12:10:00 AM

లెబనాన్‌పై ఏ క్షణమైనా దాడికి సిద్ధమన్న ప్రధాని నెతన్యాహు

న్యూ ఢిల్లీ, జూలై 29: ఇజ్రాయెల్‌లోని ముజదల్ షమ్స్ సిటీలోని ఓ ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో.. లెబనాన్‌కు చెందిన హెజ్‌బొల్లా ఓ ఉగ్ర సంస్థ శనివారం జరిపిన దాడిలో 12 మంది చిన్నారులు చనిపోయిన ఘటనను తీవ్రంగా పరిగణించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. లెబనాన్‌పై ఏ క్షణమైనా దాడి చేసేందుకు సిద్ధంగా ఉండాలని భద్రతా బలగాలను ఆదేశించారనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. అభం శుభం తెలియని చిన్నారుల మృతికి కారణమైన వారిని వదిలే ప్రసక్తే లేదు.. చిన్నారుల ప్రాణానికి లెబనాన్ వేయిరెట్లు మూల్యం చెల్లించుకోక తప్పదు అని ఇదివరకే ప్రకటించిన నెతన్యాహు.. ఆదివారం కేబినేట్ మీటింగ్‌లో మంత్రులు, భద్రతా బలగాలతో సమావేశమయ్యారు. లెబనాన్‌పై ప్రతిదాడులు చేయాలని సమావేశంలో చర్చించినట్లు సమాచారం. లెబనాన్ అన్ని లక్ష్మణరేఖలను దాటేసిందని.. ఇక ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది.