calender_icon.png 19 April, 2025 | 5:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వక్ఫ్ బోర్డు చట్ట సవరణ విరమించుకోవాలి

18-04-2025 07:07:53 PM

అశ్వారావుపేట,(విజయక్రాంతి): కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం  ముస్లింలను అణిచి వేసే ధోరణి అవలంబిస్తుందని  అశ్వారావుపేట ముస్లిం కమిటీ, వివిధ పార్టీల నాయకులు అన్నారు. శుక్రవారం జుమ్మా నమాజ్ తరవాత ముస్లిం సహోదరులు, కాంగ్రెస్, సిపి ఐ ఎం,  బి ఆర్ ఎస్ పార్టీల కలసి పట్టణం లోని రింగ్ రోడ్ నుండి బస్ స్టాండ్ ముందుగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా భారత దేశం లో ప్రజా స్వామ్య దేశంలో జీవిస్తూ ఉంటే కేంద్రం లో ఉన్న బీజేపీ ప్రభుత్వం  దేశంలోని ఆస్తులను దోచి పెట్టింది చాలక, ముస్లింలకు చెందిన వక్ఫ్ బోర్డు ఆస్తులను దోచుకునేందుకు వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని పార్లమెంటు లో ఆమోదింప చేసుకుందని అన్నారు. సవరణ చట్టాలను అమలు చేసేందుకు గాను ముస్లిమేతురలను కమిటీ సభ్యులు గా ఏర్పాటు చేసిందని ఇది ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. హిందువ సంస్థ ల కమిటీల్లో  ముస్లిం సభ్యులకు చోటు కల్పిస్తారా అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు కూడా కేంద్ర విధానాన్ని విబేధించిందని వ్యక్తులు అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు సవరణ చట్టం విరమించుకుని,  పూర్తి స్థాయిలో  ఆస్తులను ముస్లిం లకు అప్పగించాలని వారు డిమాండ్ చేశారు.