19-04-2025 12:00:00 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్18 (విజ యక్రాంతి): వక్ఫ్ చట్ట సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సిందేనని ముస్లింలు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశాల మేరకు ముస్లింలు పట్టణంలోని జామ మస్జిద్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు నల్ల రిబ్బన్లు ధరించి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం మస్జీద్ ఇమామ్‌లు మౌలానా అయజ్ అష్రఫీ, హఫీజ్ తహేర్ హష్మీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా బిల్లు సవరణ చేసింద న్నారు. వక్ఫ్ చట్ట సవరణ ద్వారా కేంద్ర వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర వక్ఫ్ సంస్థల స్వయంప్రత్తిని దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డారు. ఇది ఒకరి మత హక్కులో జోక్యం చేసుకోవడం అవుతుందని, ఇది వక్ఫ్ ఆస్తులను అపహరించే కుట్రలో భాగమేనని అన్నారు.
రా జ్యాంగానికి విరుద్ధంగా ఉన్న వక్ఫ్ చట్ట సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే వెన క్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో నాయకులు ఫయాజ్, అబ్దుల్లా, అమన్, ఉబెద్ బీన్ యాహియ (తరిక్) , అబ్దుల్ రహమాన్, రాఫిక్ అహ్మద్ , జావిద్ గులాం, ఆబ్బు, ఎండీ సలీం, సాజిద్ , ఎండీ అహ్మద్, తాజ్, ఇమ్రాన్, ఇమ్రాన్ హష్మీ, ఆసిఫ్, జమీర్ తదితరులు పాల్గొన్నారు.
ర్యాలీకి పలువురు సంఘీభావం
వక్ఫ్ సవరణ బిల్లు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ముస్లింల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ, నిరసన కార్యక్రమానికి కాం గ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు, మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గౌడ్, మాజీ ఏఎంసి చైర్మన్ మల్లేష్ , బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు భూక్య రాజు , కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు.వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ విరు ద్ధమని వారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
నల్ల బ్యాడ్జీలతో నిరసన..
బోథ్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ చట్టాన్ని వెంట నే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మైనార్టీలు నిరసన వ్యక్తం చేశారు. బోథ్ మండల కేంద్రంలోని పలు మసీదులలో శుక్రవారం నమాజ్ అనంతరం ముస్లింలు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. వక్ఫ్ ఆస్తులు, ముస్లిం సమాజ హక్కులపై కొత్త చట్టం ప్రభావితం చేస్తుందన్నారు.
ఈ చట్టం తో వక్ఫ్ ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లిం ప్రజ ల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడం వంటిదేనని పేర్కొన్నా రు. ఈ నూతన వక్ఫ్ సవరణ చట్టం ముమ్మాటికీ ఆర్టికల్ 26 ను ఉళ్లంఘిస్తుందని, వెంటనే ఈ చట్టం వెనక్కు తీసుకోవాల న్నారు. ఈ కార్యక్రమంలో మౌలానా అఖీల్ అహ్మద్, మాజీదుద్దీన్, అబ్దుల్ అలీ, ఫయీమ్‌లతో పాటు మైనారిటీ నాయకులు, యువకులు పాల్గొన్నారు.