calender_icon.png 3 February, 2025 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు పార్లమెంట్ ముందుకు వక్ఫ్ బిల్లు

03-02-2025 01:39:23 AM

తన అభ్యంతర పత్రంలో సవరణలు చేశారన్న కాంగ్రెస్ ఎంపీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: వక్ఫ్ సవరణ బిల్లు ను ప్రభుత్వం సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నసీర్ ఎక్స్ వేదికగా ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. బిల్లుపై తన అసమ్మతి తెలుపుతూ సమర్పించిన వివరణాత్మక నోట్‌లోని కొన్ని భాగాలను తనకు తెలియకుండానే సవరించారని ఆరోపించా రు.

ప్రతిపక్షాల గొంతును ప్రభుత్వం నొక్కుతుందని విమర్శించారు. కాగా వక్ఫ్ బిల్లుపై ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం జేపీసీ ఏర్పా టు చేసింది. బిల్లుపై అధ్యయనం చేసిన కమి టీ తాజాగా నివేదికను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన జేపీసీలో ఎంపీ సయ్యద్ నసీర్ కూడా ఉన్నారు.