calender_icon.png 16 March, 2025 | 3:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వక్ఫ్ సవరణలు రాజ్యాంగ ఉల్లంఘనే

16-03-2025 12:00:00 AM

వక్ఫ్ బోర్డ్ సభ్యుడు బందగీ బాద్షాహ్

 మలక్‌పేట, మార్చి 15(విజయక్రాంతి) ప్రస్తుతం ఉన్న వక్ఫ్ బోర్డ్, వక్ఫ్ చట్టం రా జ్యాంగం ద్వారా నిర్దేశించబడిన వ్యవస్థ అని, దానిని నీరుగార్చడమంటే రాజ్యాంగ స్పూర్తికి విఘాతం కలిగించడమేనని, తెలంగాణా వక్ఫ్ బోర్డ్ సభ్యుడు శ్రీ.బందగీ బాద్షాహ్ ఖాద్రీ అభిప్రాయపడ్డారు. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ సమీక్ష కోసం ఏర్పాటుచేసిన జె.పీ.సీ గురించి, కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ చేసిన వ్యాఖ్యల్ని బలపరుస్తూ మాట్లాడిన ఆయన, జేపీసీ విధివిధానాల గురించి ఎవరికీ స్పష్టతలేదని అభిప్రాయపడ్డారు.

జెపీసీ వ్యవహార శైలి, ఈ చట్టసవరణ పై ప్రతిపక్షాల అభ్యంతరాల్ని అర్థం చేసుకోవడం కోసం కాక, ఎలాగోలా ప్రభుత్వ సవరణల్ని అందరిమీద రుద్దడమే దాని ప్రధాన ఆశయంగా కనిపిస్తుందన్నారు. నిజానికి ఇది జాయింట్ వర్కింగ్ కమిటీ ఆఫ్ పార్లమెంట్ మాత్రమే తప్ప, జాయింట్ పార్లమెంట్ కమిటీ కాదనీ, జేపీసీ కి, తన ముం దుకు వచ్చిన అంశం యొక్క ప్రతి అంశాన్ని ఇన్వెస్టిగేట్ చేసి, వాటిలో మార్పు ల్ని తెచ్చే అవకాశం ఉంటుందనీ, కానీ వర్కింగ్ కమిటీకి ఈ అధికారాలు ఉండవని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తు తం దేశంలో తెస్తున్న చట్టాల్లో, పార్లమెంట్ చర్చలకంటే ముందే, సొషల్ మీడియాలో వాటి గురించి అబద్ధాలు, అర్థసత్యాలు ప్రసా రం చేసి, జనామోదం సాధించేసి, ఎలాంటి రాజ్యాంగ వ్యతిరేక చట్టాన్ని అయినా, సునాయాసంగా అమోదింపచేసుకునే ట్రెండ్ నడుస్తుందని, వక్ఫ్ సవరణ విషయంలోనూ ఇదే జరుగుతుండటం శోచనీయమని ఆయ న వ్యాఖ్యానించారు.

దాతలు దేవుని పేరు మీద దానం చేసిన ఆస్తిలో ఇతరులు జోక్యం చేసుకోవడం ఏరకంగానూ సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. హిందూ దేవాదాయశాఖకు చెందిన భూమిని, ఎండొమెం ట్ అసిస్టెంట్ కమీషనర్ రిజిస్ట్రేషన్ చేసే అధికారం ఉండగా, వక్ఫ్ చట్టంలో ప్రతిపాదించబడిన సవరణల ప్రకారం, వక్ఫ్ స్థలాల రిజిస్ట్రేషన్ అధికారం, వక్ఫ్ బోర్డ్ సీఈవో నుండి జిల్లా కలెక్టర్లకు  బదిలీ చేయడం ఎలా సమంజసం అని ఆయన ప్రశ్నించారు.  హిందూ ఎండోవ్మెంట్ చట్టం, మరియు వక్ఫ్ చట్టాల మధ్య సమతుల్యాన్ని పాటించకపోతే, అది రాజ్యాంగంలోని ఆర్టికల్-14(312/314)ని ఉద్దేశ్యపూర్వకంగా తుంగలోతొక్కడంలాంటిదేనని ఆయన ఆవేదన వెలిబుచ్చారు.