30-04-2025 12:36:23 AM
తిమ్మాపూర్, ఏప్రిల్ 29 (విజయ క్రాంతి): వక్ఫ్ నిబంధనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మెరుగుపరచడానికి, పేద మధ్యతరగతి ముస్లింల ప్రయోజనాలు, సంక్షేమం అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం వక్ఫ్ (సవరణ) చట్టం చేపట్టిందని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర తెలిపారు. బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు, వక్ఫ్ బోర్డు సవరణ కమిటీ తిమ్మాపూర్ మండల ప్రోగ్రాం కన్వీనర్ బూట్ల శ్రీనివాస్ అధ్యక్షతన వక్ఫ్ చట్ట సవరణ -2025 జన జాగరణ అభియాన్ మండల కార్యశాల ప్రోగ్రాం కొత్త పల్లి లోని సాయిరాం ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ వక్ఫ్ అనేది ఇస్లామిక్ చట్ట ప్రకారం ఇవ్వబడిన తిరిగి ఇవ్వలేని దాతృత్వ నిధి అన్నారు.
భారతదేశంలో 1996 నుండి వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చిందని తెలిపారు. 2018 కేంద్రీయ వక్ఫ్ పరిషత్ నివేదిక ప్రకారం భారత్లో 10 లక్షల కోట్లకు పైగా అంచనా విలువ కలిగిన ఎనిమిది లక్షల ఎకరాలకు పైగా వక్ఫ్ కు ఆస్తులు ఉన్నాయని తెలిపారు. అయితే వక్ఫ్ యొక్క పాలన వ్యవస్థ బలహీనంగా ఉండి, బోర్డు లో ఎవరు ఎవరికి జవాబు దారి గా ఉండ డం లేదని, ఆ కారణం చేతనే మోడీ ప్రభు త్వం వక్ఫ్ వ్యవస్థను క్రమబద్ధీకరించడానికి వీలుగా వక్ఫ్(సవరణ) చట్టం- 2025ను ప్రవేశపెట్టిందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు బూట్ల శ్రీనివాస్, మండల కన్వీనర్ వక్ఫ్ బోర్డు సవరణ చట్టం కమిటీ కో కన్వీనర్లు గడ్డం శ్రీనివాస్ రెడ్డి , బోనాల మోహన్ ,మండల ఉపాధ్యక్షులు తమ్మనవేణి రాజు,జిల్లా ఓబీసీ కార్యదర్శి ఎర్రోజు లక్మన్ , బీజేవైఎం మండల అధ్యక్షులు గడ్డం అరుణ్,బూత్ అధ్యక్షులు బండి స్వామి, తమ్మణవేని మహేష్, గొల్లపల్లి మల్లేశం గౌడ్,సుద్దాల సతీష్,పుట్ట ఓంకార్, లెనిన్, సిరిసిల్ల నర్సయ్య, ఇజ్జగిరి హరీష్, వరుకోలు రాజయ్య,మల్లెతుల అశోక్, వినవంక అంజయ్య, కొత్తూరు శ్రీనివాస్, చిందం అంజి, తదితరులు పాల్గొన్నారు.