calender_icon.png 19 April, 2025 | 11:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమల్లోకి వక్ఫ్ చట్టం

09-04-2025 12:00:00 AM

గెజిట్ నోటిఫికేషన్ విడుదల

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: కేంద్ర ప్రభత్వం ఇటీవల రూపొందించిన వక్ఫ్ సవరణ చట్టం, 2025 మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 8న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వక్ఫ్ సవరణ చట్టం మంగళవారం నుంచే అమల్లోకి వస్తుందని ఈ  నోటిఫికేషన్‌లో పేర్కొంది. లోక్‌సభ, రాజ్యసభల్లో సుదీర్ఘ చర్చ అనంతరం వక్ఫ్ సరవణ బిల్లు పార్లమెంట్ ఆమోదాన్ని పొందింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఆమోదముద్ర వేయడంతో ఆ బిల్లు చట్టంగా మారిన విషయం తెలిసిందే. కాగా, ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమంటూ ముస్లిం సంఘాలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఈనెల 16న విచారణ జరపనున్నది.