calender_icon.png 31 March, 2025 | 2:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వక్ఫ్ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి

28-03-2025 06:25:56 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): వక్ఫ్ చట్ట సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని జామ మస్జిద్ ఇమామ్ మౌలానా అయజ్ అహ్మద్ అష్రఫీ , నాయకులు అబ్దుల్ రహమాన్ డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపుమేరకు శుక్రవారం రోజున జిల్లా కేంద్రంలోని జామా మస్జిద్ లో వాక్ చట్ట సవరణ బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ముస్లింలు చేతికి బ్లాక్ బ్యాండ్ ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ బిల్లు పార్లమెంట్ లో తీసుకువచ్చిందన్నారు. వక్ఫ్ చట్ట సవరణ ద్వారా కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ , రాష్ట్ర వక్ఫ్ సంస్థల స్వయం ప్రత్తిని దెబ్బ తీస్తుందని అభిప్రాయపడ్డారు.

ఇది ఒకరి మత హక్కులో జోక్యం చేసుకోవడం అవుతుందని, వక్ఫ్ బోర్డు నిర్ణయం అంతిమంగా ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ నిర్ణయించాలని చెప్పడం ప్రభుత్వం జోక్యం చేసుకోవడమే అవుతుందన్నారు. ఇది వక్ఫ్ ఆస్తులను అపహరించే కుట్రలో భాగమే అన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న వక్ఫ్ చట్ట సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు షబ్బీర్ , ఎండి అహ్మద్ , తాజ్ , షాకీర్, సయ్యద్ రహమన్, ఎండి ఆర్షద్ , ఖలీల్, నాయిమ్ ఖాన్, అబ్బు, సాలం అఖిల్ తదితరులు పాల్గొన్నారు.