calender_icon.png 12 December, 2024 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కిల్ వర్సిటీలో భాగస్వామి కావాలి

12-12-2024 02:28:57 AM

* ఐటీ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలి

* నాస్కామ్‌కు మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి

హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో నాస్కామ్ భాగస్వామి కావాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. నాస్కామ్ అధ్యక్షుడు రాజేశ్ నంబియార్ బుధవారం సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబును కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.

కృత్రి మ మేథ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఐటీ ఉద్యోగులకు, ఇంజినీరింగ్ గ్రాడ్యూయేట్లకు శిక్షణ ఇవ్వడంలో నాస్కామ్ కీలక పాత్ర పోషించాలని మంత్రి అభిలాషించారు. హైదరాబాద్ జీసీసీల గమ్యస్థానంగా మారిందని, కొత్త సంస్థలు ఇక్కడ అడుగుపెట్టేందుకు నాస్కామ్ తన పలుకుబడిని ఉప యోగించాలని కోరారు.

రానున్న కొద్ది సం వత్సరాల్లో తెలంగాణ ఐటీ రంగంలో దేశంలోనే అగ్రగామిగా వృద్ధి చెందుతుందని మంత్రి వెల్లడించారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఎక్కడాలేని విధంగా ప్రపంచస్థాయి ఎకో సిస్టంను నెలకొల్పామని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయికృష్ణ, నాస్కామ్ ప్రతినిధులు శ్రీకాంత్ శ్రీనివాసన్, ప్రవీణ్, ప్రభుత్వ ఐటీ వ్యూహకర్త శ్రీకాంత్ పాల్గొన్నారు. 

ప్రపంచ ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ

తెలంగాణను ప్రపంచ ఆవిష్కరణల కేంద్రంగా, ఆధునిక సాంకేతికతకు చిరునామాగా అభివృద్ధి చేయడంలో తమ ప్రభు త్వం నిరంతరం పాటుపడుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. కృత్రిమమేధ, జీవశాస్త్రాలు, టెక్నాలజీ రంగాల్లో దిగ్గజ సంస్థలను ఆకర్షించడం ద్వారా ఇప్పటికే పెట్టుబడుల ఆకర్షణ కేంద్రంగా నిలిచిందని వెల్లడించారు.

బుధవారం న్యూజెర్సీ ఇన్నోవేషన్స్ ఇన్‌స్టిట్యూట్, న్యూజెర్సీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలతో టీ ఫౌండేషన్ వాణిజ్య, సాంకేతిక ఆవిష్కరణల భాగస్వామ్యంపై అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో సానుకూల వాతావరణాన్ని సృష్టించడం ద్వారా భారతీయ అమెరికన్లు, వృత్తి నిపుణులకు న్యూజెర్సీ అవకాశాలను కల్పిస్తోందన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా రాష్ట్రం ఇతోధిక అభివృద్ధిని సాధిస్తుందన్న ఆశాభావం తనకు ఉందని పేర్కొన్నారు.

అవగాహన ఒప్పంద కార్యక్రమంలో న్యూజెర్సీ లెఫ్టినెంట్ గవర్నర్ తాహెషా వే, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, టీహబ్ సీఈవో సుజిత్ జాగిర్దార్, చీఫ్ డెలివరీ ఆఫీసర్ ఫణి కొండేపూడి తదితరులు పాల్గొన్నారు.