calender_icon.png 4 October, 2024 | 7:06 AM

గూఢచారులు కావలెను

04-10-2024 01:17:24 AM

న్యూయార్క్, అక్టోబర్ 3: తమ ప్రత్యర్థి దేశాలైన చైనా, ఉత్తర కొరియా, ఇరాన్ నుంచి ఇన్ఫార్మర్లు కావాలని అమెరికా నిఘా సంస్థ సీఐఏ సోషల్ మీడియా ప్రకటన సంచలనంగా మా రింది. మాండరీన్, ఫార్సీ, కొరియా భాషల్లోని ఎక్స్, ఫేస్‌బుక్, యూట్యూ బ్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, లింక్డిన్ అకౌంట్స్‌లో ఈ ప్రకటనను పోస్ట్ చేసి ంది. తమను ఎలా రహస్యంగా సంప్రదించాలో కూడా ప్రకటనలో పేర్కొం ది.

డార్క్‌వెబ్‌లో కూడా ఇలాంటి ప్రకటన వెలువడటం గమనార్హం. వీపీఎన్, టోర్ నెట్‌వర్క్ ఆధారంగా తమ అధికారిక వెబ్‌సైట్‌లో సంప్రదించాలని, ఆయా దేశాల కేంద్రంగా పనిచేసే వీపీఎన్‌లను మాత్రం వాడొద్దని సూచిం చింది.

గతంలో రష్యాలో నియామకాలకు ఇలాంటి వ్యూహాన్నే వాడి విజ యం సాధించినట్లు సియోల్ హాంకాక్ యూనివర్సిటీ ఆఫ్ ఫారెన్ సర్వీస్ ప్రొఫెసర్ మాసొన్ రిచీ పేర్కొన్నారు. కానీ, ఇంటర్నెట్ అంటుబాటులో లేని ఉత్తరకొరియాలో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చెప్పలేమన్నారు.