22-10-2024 01:03:49 AM
గురుగ్రామ్: భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలిపాడు. కానీ ఫిట్‌నెస్‌ను నిరూపించుకునేందుకు రంజీల్లో ఆడాలనుకుంటున్నట్లు తెలిపా డు. ‘నేను 100 శాతం ఫిట్‌గా ఉన్నా. గత కొద్ది రోజులుగా పూర్తి స్థాయి రనప్‌తో బౌలింగ్ చేయడం లేదు. కానీ ఆదివారం మాత్రం మం చి ఈజ్‌తో బౌలింగ్ చేశా. అది నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. ఆసీస్ టూర్‌లో ఆడతానా లేదా అని అంతా ఎదురుచూస్తున్నారు. కానీ దానికి ఇంకా సమయం ఉంది’ అని తెలిపాడు.