సహజంగా వంట చేసేటప్పుడు మరకలు అవుతూ ఉండటం కామన్. టైల్స్, గోడలపై మరకలు పడి మురికిగా కనిపిస్తాయి. అయితే వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడానికి కుదరదు. అప్పుడప్పుడూ క్లీన్ చేసినా జిడ్డుగా మారి.. మురికి అస్సలు పోదు. దీని వల్ల గోడలు, టైల్స్ చాలా మురికిగా పాత వాటిలా కనిపిస్తాయి. కొన్ని చిట్కాలు పాటిస్తే.. టైల్స్, గోడల మురికి పోయి కొత్త వాటిలా మెరుస్తాయి.
- మొండి మరకలను వదిలించడంలో లిక్వడ్ డిష్ వాష్ బాగా పని చేస్తుంది. గోరువెచ్చటి నీటిలో కొద్దిగా లిక్విడ్ డిష్ వాష్ వేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని కిచెన్ టైల్స్, గోడలపై అప్లు చేసి ఓ ఐదు నిమషాలు వదిలేయాలి. ఆ తర్వాత రుద్దితే జిడ్డు మరకలు పోతాయి.
- టైల్స్‌పై జిడ్డు మరకలను తొలగించడంలో నిమ్మరసం చక్కగా పని చేస్తుంది. కొద్దిగా నీటిలో నిమ్మరసం, కొద్దిగా సర్ఫ్ కలిపి టైల్స్, గోడలపై చల్లి స్క్రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మురికి వదిలి కొత్తవాటిలా మెరుస్తాయి.
- వెనిగర్ కూడా జిడ్డు మరకలను వదిలించడంలో సహాయపడుతుంది. వంట గోడలపై, టైల్స్‌పై పడ్డ మరకలను పోగొట్టడం వెనిగర్ బాగా పని చేస్తుంది. కొద్దిగా గోరు వెచ్చటి నీటిలో వెనిగర్ కలిపి.. మరకలపై చల్లాలి. ఓ రెండు నిమిషాల తర్వాత స్క్రబ్ చేస్తే సరిపోతుంది.
- బేకింగ్ సోడాతో కూడా టైల్స్‌పై పడ్డ మరకలను ఈజీగా తొలగించుకోవచ్చు. చిన్న పాత్రలో వేడి నీళ్లు తీసుకోవాలి. అందులో బేకింగ్ సోడా కలిపి.. మొండి మరకలు ఉన్నచోట నీళ్లు పోస్తూ రుద్దాలి. ఇలా చేయడం వల్ల మరకలు పోయి.. కొత్త వాటిలా కనిపిస్తాయి.