09-03-2025 12:00:00 AM
ప్రస్తుత పోటీ ప్రపంచంలో కెరీర్‌లో సక్సెస్ కావాలంటే చిన్న చిన్న అలవాట్లను అభిరుచులుగా మలుచుకుంటే సరిపోతుందని చెబుతున్నారు నిపుణులు. అప్పుడే అనుకున్న లక్ష్యంవైపు దూసుకెళ్లవచ్చు అంటున్నారు. జీవితంలో సక్సెస్ కావాలంటే.. పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం..
ప్రతికూలత అనేది ప్రతి అంశాన్ని చె డుగా చూపిస్తుంది. దీం తో నిరాశ, నిస్పృహలు దరి చేరుతాయి. ఇది మీ లక్ష్యానికి అడ్డుపడవచ్చు. ఏ విషయాన్నైనా నెగెటివ్‌గా కాకుండా పాజిటివ్‌గా ఆలోచించడం మొదలు పెట్టండి. అప్పుడే మీరు అనుకున్న లక్ష్యంవైపు అడుగులు వేయవచ్చు.
గ్యాడ్జెట్లకు దూరంగా..
యువత ఎక్కువగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లతో కాలం గడుపుతున్నారు. దీంతో సమయం వృథా అవుతున్నది. రాత్రి పడుకునే సమయంలో సరిగా నిద్రంచలేకపో తున్నారు. ఇది భవిష్యత్‌కు భంగం కలిగించవచ్చు. సరైన నిద్ర లేకపోతే ఏ విషయం పైనైనా సరిగా దృష్టి పెట్టలేం. దీంతో నీర సం, ఓపిక లేకపోవడం వంటివి దరిచేరుతాయి. ఆరోగ్యకరమైన జీవనం, మంచి భవిష్యత్‌కు ఈ అలవాటు మానుకోవడం మంచిది.
బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయొద్దు..
ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ను చేయడం మరువద్దు. మీరు ఏ పని ప్రారంభించాలనుకు న్నా మితమైన ఆహారం తీసుకోండి. ఉద యం అల్పాహారం తీసుకోకపోతే నీర సం ఆవహిస్తుంది. దీంతో ఏ పనిపైనా శ్రద్ధ పెట్టలేరు.
అతిగా ఆలోచించవద్దు..
అతిగా ఆలోచించడం మంచిది కాదు. దీనివల్ల మీపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల ఉద్యోగ పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇది ఆందోళన, నిరాశకు దారితీస్తుంది.
ఒకేచోట కూర్చోవద్దు..
ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఇంట్లో సోఫాపై ఎక్కువసేపు కూర్చుకుంటున్నారు. ఒకేచోట కూర్చొనే బదులు పుస్తకాలు చదవడం, ఆటలు ఆడటం, వ్యాయామం, యోగా వంటివి చేయండి. ఆసక్తి ఉన్న కార్యకలాపాల్లో పాల్గొనండి.
స్థిరమైన మనస్తత్వంతో..
ఎప్పుడూ స్థిరమైన మనస్తత్వం ఉండకూడదు. సమాజానికి, జనరేషన్‌కు తగ్గట్టు ఆలోచించాలి. ఇలా చేయడం ద్వారా తప్పులను, విమర్శలను అంగీకరించడానికి అవకాశం ఉంటుంది.
అతిగా ఖర్చువద్దు..
అతిగా ఖర్చు చేయడం మానుకోవాలి. పొదుపు చేయడం ద్వారా అత్యవసర సమయాల్లో.. క్లిష్టసమయాల్లో మీకు ఉపయోగపడుతుంది. ఈ చిట్కాలను పాటిస్తే జీవితంలో సక్సెస్‌వైపు అడుగులు వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.