calender_icon.png 19 March, 2025 | 1:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలోనే క్రీడా హాబ్ గా మారనున్న వనపర్తి

17-03-2025 12:00:00 AM

వనపర్తి, మార్చి 16 ( విజయక్రాంతి) : త్వరలోనే వనపర్తి జిల్లా కేంద్రాన్ని క్రీడా హాబ్ గా ఏర్పాటు చేయనున్నట్లు, రాష్ట్ర స్పోరట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి లు  పేర్కొన్నారు.  ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రం డాక్టర్ బాలకిష్టయ్య క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన 68వ  ఎస్ జి ఎఫ్  రాష్ట్రస్థాయి అండర్ 14  ఫుట్ బాల్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు.

విద్యార్థులు ఉన్నత చదువుతోపాటు క్రీడలపై దృష్టి సారిస్తే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందవచ్చునని, క్రీడాకారులందరూ గెలుపు ఓటములను  స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందుకెళ్లాలని వారు సూచించారు.

తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా క్రీడాకారులకు తగు శిక్షణ ఇచ్చి  తయారుచేయునట్లు వారు తెలిపారు. త్వరలోనే వనపర్తిలో ఫుట్ బాల్ అకాడమీ ఏర్పాటు చేయను న్నామని వనపర్తికి రాష్ట్రస్థాయిలోనే క్రీడాపర్తిగా గుర్తింపు వచ్చే విధంగా ఇక్కడ 50 గదులతో వసతి గృహాన్ని సైతం నిర్మిస్తామని వారు తెలిపారు. 

వనపర్తిలో  రూ 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ హబ్ ఏర్పాటు చేయనున్నామని, దీంతో విద్యార్థులకు మూడ వ తరగతి నుంచి పీజీ వరకు ఉన్నత విద్య అందించవచ్చునని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో  వనపర్తి మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, వనపర్తి జిల్లా యూత్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీర్ల చందర్, సమన్వయకర్త లక్కాకుల సతీష్, జిల్లా క్రీడా శాఖ అధికారులు సుధీర్ కుమార్ రెడ్డి, సురేందర్ రెడ్డి, క్రీడాకారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం.

పెబ్బేరు, మార్చి 16: ప్రభుత్వ పరంగా బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి తెలిపారు. మండలంలోని గుమ్మడం గ్రామంలో ఇటీవల్ల ప్రమాదవ శాతుతో పశుగ్రాసం పూర్తిగా కాలిపోయిన విషయం తెలుసుకొని ఆదివారం బాధితులు మాసులు, వెంకటయ్య, కృష్ణయ్య, బాలమసిలను పరామర్శించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

తక్షణ సహాయానిధి ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం అయ్యవారిపల్లి గ్రామం లో రూ.35లక్షల నిధులతో సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు సాయిచరణ్ రెడ్డి, తిరుపతి రెడ్డి, అక్కి శ్రీనివాస్ గౌడ్, విజయవర్ధన్ రెడ్డి, వెంకట్ రాములు యాదవ్, రాంరెడ్డి, భానుప్రకాష్ రెడ్డి, కురుమూర్తి పాల్గొన్నారు.

పెబ్బేరు సంత స్థలం ప్రతి అంగుళం ప్రజలదే.

పెబ్బేరు, మార్చి 16: పెబ్బేరు సంత స్థలం ప్రతి అంగుళం ప్రజలదేనని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు. ఆదివారం వేణుగోపాల స్వామి భూమి పరిరక్షణ సమితి సభ్యులతో సమావేశమై చర్చించారు. ఈ సందర్బంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ గత కొన్ని ఏండ్ల నుంచి పెబ్బేరు నడిబొడ్డున 30ఎకరాల భూమి విస్తీర్ణంలో సంత కొంసాగు తుందన్నారు.

పూజారుల వెనుక ఉన్న భూకబ్జాదారులు, అతీత శక్తుల కబందా హస్తలలోకి సంత స్థలం పోకుండా కాపాడుతానని హామీ ఇచ్చారు. ఆలయ పూజారులకు తగిన ప్రతిఫలం ఇచ్చి న్యాయం చేస్తానన్నారు. సంత స్థలం విషయం హైకోర్టు పరిధిలో ఉండటం చేత కొంత ఆలస్యం అవుతుందన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో శ్రీ వేణుగోపాల స్వామి భూమి పరిరక్షణ సమితి సభ్యులు ఉన్నారు.