calender_icon.png 28 October, 2024 | 7:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అతి తక్కువలో అరుదైన శస్ర చికిత్స

24-07-2024 12:31:25 PM

వనపర్తి (విజయక్రాంతి ): నేటి పోటీ ప్రపంచంలో డబ్బే పరామవధిగా నడుస్తున్న కార్పొరేట్ వైద్యం ప్రస్థానంలో వెల్ నెస్ ఆసుపత్రి బడుగు బలహీన వర్గాల ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో అరుదైన శస్ర చికిత్స చేసి మహిళ ప్రాణాలను కాపాడామని ఆసుపత్రి వైస్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్ తెలిపారు.

బుధవారం జిల్లా కేంద్రం లోని ఓ ఫంక్షన్ హల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  వనపర్తి పట్టణానికి చెందిన ఓ మహిళ గత 6 నెలల కిత్రం సీజరియాన్ జరిగింది ఆ సమయంలో చిన్న ప్రేగు గాయం మై తీవ్ర అశ్వస్థతకు గురి అయింది.  దింతో వారి కుటుంబ సభ్యులు పలు కార్పొరేట్ ఆసుపత్రిలకు వెళ్లిన సమస్య పరీక్షారం కాలేదు.  చివరగా హైదరాబాద్ అమీర్ పేట లోని వెల్ నెస్ ఆసుపత్రి కీ సంప్రదించగా జనరల్ సర్జన్ డాక్టర్ హర్ష వర్ధన్, ఇంటెన్సీవిస్ట్ డాక్టర్ కార్తీక్ ల ఆధ్వర్యంలో ఆమెకు సర్జరీ చేసి మొదటగా స్టొమా చేసి రెండు నెలల తరువాత పూర్తి స్థాయి సర్జరీ చేయడం వల్ల ఆమె పూర్తి స్థాయిలో కోలుకోవడం జరిగిందన్నారు