calender_icon.png 21 November, 2024 | 2:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిపాలన తక్కువ.. మూటలు మోయడానికి ప్రాధాన్యత....

21-11-2024 01:02:06 PM

నాడు పిషాచిలా ఉన్న సోనియా గాంధీ నేడు కాళ్ళ కింద నీళ్లు చల్లకోవాలా 

ఇటలీ వారసులకు నకిలీ గాంధీలకు గులాం గిరి చేసే వ్యక్తి సి ఎం 

బిజెపి జిల్లా అధ్యక్షులు నారాయణ

వనపర్తి, (విజయక్రాంతి): అబద్దాల హామీలను ఇచ్చి ప్రజలను తప్పు దోవ పట్టించి అధికారం లోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిందని తీరా అధికారంలోకి దాదాపు సంవత్సరం కావస్తున్న హామీలను అమలు చేయకుండా రాష్టం నుండి ఢిల్లీ కీ మూటలు మోయడానికి పని చేస్తున్నారని పరిపాలన తక్కువ మూటలు మోయడానికి ప్రాధాన్యతను సి ఎం రేవంత్ రెడ్డి ఇస్తున్నారని బిజెపి జిల్లా అధ్యక్షులు నారాయణ విమర్శలు చేశారు. గురువారం జిల్లా కేంద్రం లోని ఓ ఫంక్షన్ హల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బి జె పి నాయకుల తో కలిసి ఆయన మాట్లాడారు.  ప్రజల ఓట్ల తో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత ప్రజలను విస్మరిస్తున్నరన్నారు. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మాట్లాడిన విధంగా సి ఎం హోదాలో కూడా మాట్లాడడం ప్రజలను అంగీకరీంచరన్న విషయాన్నీ గుర్తు పెట్టుకోవాలన్నారు. వరంగల్ బహిరంగ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేయడం  సి ఎం రేవంత్ రెడ్డి అహంకారినికి నిదర్శనమన్నారు.  పూటకు ఒక పార్టీ మార్చుకుంటూ వెళ్ళుతు తెలంగాణ ఉద్యమం లో 1300 మంది  అమరవీరులు బలిదానాలు చేసుకుంటున్న సమయంలో సమైఖ్య ఆంధ్ర కు మద్దతు తెలుపుతూ నాడు పిషాచి లా ఉన్న సోనియా గాంధీ నీకు సి ఎం పదవి ఇస్తే కాళ్లు కడిగి నెత్తిన చల్లుకోవాలని చెబుతున్నారని ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన వారికీ మాత్రం ఇబ్బందులు పెట్టడం పనిగా పెట్టుకున్నారన్నారు.  

 రేవంత్ రెడ్డి సి ఎం అయిన తరువాత ఇటలీ వారసులకు నకిలీ గాంధీలకు నీవు గులాం గిరి చేస్తున్నారని అయన విమర్శించారు. కె సి ఆర్ 10 ఏండ్లు పరిపాలన చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలల పాలనలో రాక్షస పాలన చేస్తున్నారని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రతి పక్షాలను విమర్శలు చేయడమే పనిగా సి ఎం రేవంత్ రెడ్డి పెట్టుకున్నారని ఆయన మండి పడ్డారు.   తెలంగాణ కు కేంద్రం నుండి ఎలాంటి నిధులు తీసుకుని రాలేదని మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ కు ఎన్ని నిధులను తీసుకుని వచ్చారో ప్రజలందరికి తెలుసునని ప్రజల ముందుకు సి ఎం రేవంత్ రెడ్డి వస్తే వివరించడానికీ బి జె పి సిద్ధంగా ఉన్నామని సి ఎం సిద్ధంగా ఉన్నారా అని ఆయన విమర్శించారు.  హైడ్రా పేరుతో ప్రజలను రోడ్ల మీదకు తీసుకొని వచ్చారని, ప్రజలు, రైతులు వద్దు అని నిరసనలు వ్యక్తం చేస్తున్న నీ అల్లుడి కోసం కొడంగల్ లో ఫార్మా కంపెనీ తీసుకుని వస్తున్నారని, ఖాన్ ల గులాంగిరి కోసం మూసి నది ప్రక్షాళన చేస్తున్నారన్నారు.  ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు రవీందర్ రెడ్డి, మెంటపల్లి పురుషోత్తం రెడ్డి, జిల్లా నాయకులు రామన్ గౌడ్, పెద్ది రాజు తదితరులు పాల్గొన్నారు.