23-04-2025 12:52:09 AM
వనపర్తి, ఏప్రిల్ 22 ( విజయక్రాంతి ) : మంగళవారం విడుదలైన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో వనపర్తి అభ్యాస్ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు, ఉమ్మడి జిల్లాస్థాయి టాప్ మార్కులతో మరోసారి ప్రభంజనం సష్టించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంఈసీ విభాగంలో కె. లహరి 495 మార్కులతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొదటి ర్యాంకు , తెలంగాణ రాష్ట్రంలో రెండో ర్యాంకు సాధించగా.. భవిత, మనస్విత రాష్ట్రస్థాయిలో 493, 492 మార్కులతో సత్తాచాటారు.
ఎంపీసీ విభాగంలో 466 మార్కులతో కావలి ఝూన్సీ రాణించగా.. ప్రణవి, రసజ్న రెడ్డి 465, 464 మార్కుతో స్టేట్ ర్యాంకులతో నిలిచారు. బైపీసీ విభాగంలో టి. గౌతమి, లక్ష్మీరేష్మా 430 మార్కులు సాధించారు. సీఈసీ విభాగంలో విద్యావత్ సునీల్ 488 మార్కులతో ప్రభంజనం స్రుష్టించి జేఈఈ, సీఏ ఫలితాల్లో 5 సంవత్సరాల్లో దాదాపు 100కు పైగా విద్యార్థులు అర్హత సాధించారని అభ్యాస్ విద్యాసంస్థల ఛైర్మన్ మనిగిల్ల జ్నానేశ్వర్ రెడ్డి, ప్రిన్సిపల్ ముజమిల్, లోక్నాథ్ తెలిపారు.