22-02-2025 12:00:00 AM
వామికా గబ్బి.. అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ సెన్సేషన్‌గా మారింది. ఈ ముద్దుగుమ్మ ఇం డస్ట్రీలోకి కొత్తగా ఏమీ రాలేదు. ఎప్పటి నుంచో ఉంది కానీ ‘బేబీ జాన్’ చిత్రం ఆమెను ఊహించని క్రేజ్ తెచ్చిపెట్టింది. సినిమా ఆశించిన ఫలితాన్నివ్వకున్నా అమ్మడికి మాత్రం బాగా కలిసొచ్చింది. ఈ ముద్దుగుమ్మ లక్కేంటో కానీ ఫ్లాప్ సినిమాతో క్రేజీ ఆఫర్స్ పట్టేస్తోంది. ప్రస్తుతం ఆమె ఏకంగా ఐదు ఇండస్ట్రీలలో అవకాశాలను దక్కించుకుంది. హిందీలో రాజ్‌కుమార్ రావ్ హీరోగా వస్తున్న ‘భూల్ చుక్ మాఫ్’లో నటిస్తోంది.
ఇది మాత్రమే కాకుండా ‘దిల్ కా దర్వాజా కోల్ నా డార్లింగ్’, ‘భూత్ బంగ్లా’, ‘రక్త్ బ్రహ్మాండ్’ వంటి ప్రాజెక్టులలో నటిస్తోంది. ఇక పంజాబీలోనూ ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. మరోవైపు సౌత్‌లోనూ అవకాశాలు కొల్లగొడుతోంది. తెలుగులో అడివి శేష్ మూవీ, ‘గూఢచారి’ సీక్వెల్ ‘గూఢచారి 2’లో నటిస్తోంది. తమిళంలో ‘జీని’ అనే చిత్రంలోనూ నటిస్తోంది. మలయాళంలో ‘టికీ టాకా’, అలాగే రణ్‌బీర్ అప్ కమింగ్ ప్రాజెక్టులోనూ వామికా గబ్బీయే హీరోయిన్ అని టాక్ నడుస్తోంది. ముద్దుగుమ్మ ఫ్లాప్స్ కొట్టే ఇంత జోరు మీదుంటే హిట్ కొడితే ఇంకెలా ఉంటుందో చూడాలి.