calender_icon.png 19 April, 2025 | 1:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంతానంతో సైన్యాన్ని సృష్టిస్తాడట!

17-04-2025 11:46:55 PM

ఎలాన్ మస్క్‌పై వాల్‌స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం

జపాన్ మహిళకు వీర్యం ఆఫర్ చేసిన టెస్లా అధినేత!

వాషింగ్టన్ డీసీ: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇప్పటికే 14 మంది పిల్లలకు తండ్రి అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా తన సంతానంతో సైన్యాన్ని సృష్టించాలని మస్క్ అనుకుంటున్నట్టు ప్రఖ్యాత వాల్‌స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం ప్రచురించింది. అందుకోసం ఒక జపనీస్ ఇన్లూయెన్సర్ అయిన జపాన్ మహిళ టిఫనీ ఫాంగ్‌కు తనతో బిడ్డను కనాలని కోరుతూ ఆమెకు వీర్యదానం పంపించినట్టు పేర్కొంది. ఇది జరిగి ఏడాది అవుతుందని, మస్క్ ఆమెను ఎక్స్‌లో ఫాలో అవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

మస్క్ కూడా టిఫనీని ఫాలో అవ్వడంతో ఆమె ఫాలోవర్స్ సంఖ్య అమాంతం పెరిగిపోయి రెండు వారాల్లోనే 21 వేల డాలర్లను సంపాదించినట్టు కథనంలో పేర్కొనడం విశేషం. అయితే మస్క్ ఆఫర్‌ను టిఫనీ ఫాంగ్ తిరస్కరించిందని, ఆమెకు అప్పటికే పిల్లలు ఉన్న ఫోటోలను కూడా చూపించినట్టు తెలుస్తోంది. కాగా జపాన్ మహిళకు వీర్యం ఆఫర్ చేసినట్టు వచ్చిన కథనాలను మస్క్ కొట్టిపారేశారు. డబ్ల్యూఎస్‌జే వెబ్‌సైట్ అనేది ఒక గాసిఫ్ వెబ్‌సైట్ అని, అందులో గాసిఫ్‌లు తప్ప ఏమి ఉండవని పేర్కొన్నారు.