calender_icon.png 28 September, 2024 | 4:46 AM

గ్రేటర్‌లో వాల్ పోస్టర్లు.. వాల్ రైటింగ్స్ నిషేధం

28-09-2024 02:14:26 AM

జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి 

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్స్ నిషేధిస్తూ జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి శుక్రవారం ఉత్తర్యులు జారీ చేశారు. నగర బ్రాండ్ ఇమేజ్ పెంపొందించడంతో పాటు సుందరీకరణే లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ ముందుకు వెళ్తున్నదని, దీనిలో భాగంగానే వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్స్‌ను నిషేధిస్తున్నామని స్పష్టం చేశారు.

సర్కార్ అనుమతి లేకుండా ఎవరైనా గోడలపై పోస్టర్లు అంటించినా, వాల్ రైటింగ్స్ రా యించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు నగరంలోని ఆయా సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు ప్రింటింగ్ ప్రెస్, సినిమా థియేటర్ యాజమానులతో సమావేశం నిర్వహించి గోడలపై వాల్ పోస్టర్లు, సినిమా పోస్టర్స్ అంటించకుండా చూడాలన్నారు.

వాల్ రైటింగ్స్ రాయకుండా నివారించాలని ఆదేశించారు. డిప్యూటీ కమిష నర్లు అశ్రద్ధ వహించకుండా కఠినంగా వ్యవహరించాలని సూచించారు. అవసరమైతే నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించాలని నిర్దేశించారు.