24-02-2025 11:31:15 AM
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Andhra Pradesh budget session) తీవ్ర గందరగోళంతో ప్రారంభమయ్యాయి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (Yuvajana Sramika Rythu Congress Party) సభ్యులు నిరసన తెలిపారు. గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తుండగా, వైయస్ఆర్సిపి శాసనసభ్యులు సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించి, స్పీకర్ పోడియంలోకి ప్రవేశించి ప్రసంగాన్ని అడ్డుకున్నారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, వైయస్ఆర్సిపిని ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అధికారికంగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్న సభ్యులు నినాదాలు చేశారు. గందరగోళం ఉన్నప్పటికీ, గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. దాదాపు 11 నిమిషాల నినాదాలు ,నిరసనల తర్వాత, పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy)తో సహా వైయస్ఆర్సిపి సభ్యులు అసెంబ్లీ నుండి వాకౌట్ చేశారు. వైయస్ఆర్సిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ సభ నుండి నిష్క్రమించారు.