01-04-2025 11:58:27 PM
పౌర దేవి దర్శనానికి బయలుదేరిన సేవాలాల్ మహరాజ్ భక్తులు..
ఆదిలాబాద్(విజయక్రాంతి): బంజారాల ఆరాధ్యదైవం పౌర దేవి దివ్యదర్శనానికి వేలాదిగా సేవాలాల్ భక్తులు పాదయాత్రగా బయలుదేరారు. నెల రోజుల పాటు భక్తులు కఠోర దీక్ష చేపట్టిన భక్తులు నార్నూర్ మండలంలోని దీక్ష భూమి కొత్తపల్లి నుండి దీక్ష గురు ప్రేమ్ సింగ్ మహరాజ్ నేతృత్వంలో ఉగాది రోజున పాదయాత్రను ప్రారంభించారు. సుమారు 200 కిలోమీటర్ల దూరంలోని మహారాష్ట్ర వాసిం జిల్లాలో గల పౌర దేవి వరకు మండుటెండలో సైతం పాదరక్షలు లేకుండా పాదయాత్రగా చేరుకుంటారు. మంగళవారం జిల్లా కేంద్రానికి చేరుకున్న పాదయాత్ర భక్తులకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ అన్నదానం చేపట్టారు. ఆదిలాబాద్ లోనినే బస చేసిన భక్తులు బుధవారం మళ్లీ పాదయాత్రను ప్రారంభిస్తారు.