హైదరాబాద్ సిటీబ్యూరో, మే 17 (విజయక్రాంతి) : వరల్డ్ హైపర్టెన్షన్ డే సందర్భంగా అవగాహన పెంచేందుకు టీఎక్స్ ఆస్పత్రులు 3కే వాకథాన్ నిర్వహించాయి. కార్డియాలజిస్ట్ డాక్టర్ శరత్ చంద్ర, సుమీత్ సిన్హా, దీపక్ సహా, జె.శశి, పృథ్వీ, అవినాష్ దాల్ హైపర్టెన్షన్ గురించి వివరించారు. రక్తపోటు, దాని పర్యవసనాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. కార్యక్రమంలో డైరెక్టర్లు డాక్టర్లు కీర్తికర్ రెడ్డి, దీపక్ రాజు, రవీంద్ర రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.