calender_icon.png 14 March, 2025 | 12:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యక్తిగత ఆరోగ్యం దృష్టిపెట్టాలి

13-03-2025 09:23:21 PM

కిడ్నీ దినోత్సవం సందర్భంగా గ్లెనీగల్స్ అవేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో 5కే వాకథాన్ 

ఎల్బీనగర్: ప్రపంచ కిడ్నీ దినోత్సవం(World Kidney Day) సందర్భంగా ఎల్బీనగర్ లోని  గ్లెనీగల్స్ అవేర్ హాస్పిటల్(Gleneagles Aware Hospital) ఆధ్వర్యంలో గురువారం 5కే వాకథాన్(5K Walkathon) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి(Lingojiguda Corporator Darpally Rajasekhar Reddy) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కిడ్నీ వ్యాధులు రోజురోజుకూ పెరుగుతున్నాయని, ప్రజలందరూ వ్యక్తిగత ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.

భవిష్యత్తులో మరిన్ని సమస్యలను నివారించడానికి ముందస్తుగా వైద్య పరీక్షలు చేయించుకుని, ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని వైద్యులు వివరించారు. గ్లెనీగల్స్ అవేర్ హాస్పిటల్ లో రూ.999 లకు కిడ్నీ హెల్త్ ప్యాకేజీని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. డయాబెటిస్, బీసీ, కాలేయ వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. 40 ఏళ్లు పైబడిన వారు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి, నవీన్, ప్రభుచరణ్ , కన్సల్టెంట్ వైద్యులు పాల్గొన్నారు.